ETV Bharat / state

నాణ్యమైన డిజిటల్​ తరగతుల కోసం.. క్లాస్​రూమ్​ టీవీ ఆవిష్కరణ!

కరోనా వైరస్​ వ్యాప్తి వల్ల పాఠశాలలు ప్రారంభం కాక.. ఆన్​లైన్​లో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం పాఠశాలలకు సూచించింది. అయితే.. ఇంటర్నెట్​ సౌకర్యం లేక, సిగ్నల్స్​ సరిగ్గా లేక ఆన్​లైన్​ తరగతులు వినడంలో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలకు చెక్​ పెట్టేందుకు నెక్స్ట్​ డిజిటల్​ ముందుకొచ్చింది. క్లాస్​రూమ్​ టీవీతో నాణ్యమైన డిజిటల్​ క్లాసులు వినేలా సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఇంట్లోని టీవీలోనే.. హెచ్​డీ క్వాలిటీతో పాఠాలు వినే క్లాస్​రూమ్​ టీవీని ప్రారంభించింది.

Next Digitals inaugurates Classroom Tv For Digital Classes
నాణ్యమైన డిజిటల్​ తరగతుల కోసం.. క్లాస్​రూమ్​ టీవీ ఆవిష్కరణ!
author img

By

Published : Sep 18, 2020, 5:13 PM IST

డిజిటల్​ తరగతుల కోసం.. గ్యాడ్జెట్స్ కొనలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు, తక్కువ ఇంటర్నెట్ స్పీడ్​తో ఆన్​లైన్​ క్లాసులు వినలేకపోతున్న విద్యార్థులకు క్లాస్​రూమ్​ టీవీ మంచి ప్రత్యామ్నయం అన్నారు కంపెనీ ఛైర్మన్ శ్రీకుమార్. 8, 9, 10వ తరగతుల విద్యార్థులు రూ.999 సంవత్సర చందా కట్టి ఆయా తరగతులకు సంబంధించిన పాఠాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో టీవీలోనే వినొచ్చని ఆయన తెలిపారు. నెక్స్ట్ డిజిటల్​తో పాటు.. ఇతర ఎంఎస్​వోలు, కేబుల్​టీవీల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఇంట్లోని టీవీల్లోనే డిజిటల్ క్లాసులు వినొచ్చన్నారు. టీవీతో పాటు యాప్, వైబ్​సైట్​లో కూడా పాఠాలు వినే సౌకర్యం ఉందని ఆయన పేర్కొన్నారు.

నాణ్యమైన డిజిటల్​ తరగతుల కోసం.. క్లాస్​రూమ్​ టీవీ ఆవిష్కరణ!

టీవీ మాధ్యమం ద్వారా డిజిటల్ తరగతులు బోధించే తమ ఫ్యాకల్టీ.. కార్పొరేట్ పాఠశాలల స్థాయి క్వాలిటీ విద్యను విద్యార్థులకు అందిస్తారని.. స్టేట్, సెంట్రల్​ సిలబస్​ను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారని కంపెనీ సీఓఓ సుభోదీప్ అన్నారు. 24గంటలు నడిచే ఈ ఛానల్ ద్వారా పిల్లలు అర్థం కాని తరగతులను మళ్లీ మళ్లీ వినవచ్చని, రివిజన్​ చేసుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి : ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.