రాష్ట్రంలో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 3 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 2,88,789 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1,559 మంది మృతిచెందారు. మహమ్మారి నుంచి మరో 305 మంది బాధితులు కోలుకున్నారు.
ఇప్పటివరకు కరోనా నుంచి 2,82,177 మంది బాధితులు కోలుకుని ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,053 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో 2,776 మంది బాధితులున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 71 కరోనా కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి: అజాగ్రత్తగా ఉంటే ముప్పే... మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు