ETV Bharat / state

New Ration Cards: రేపటి నుంచి కొత్త రేషన్​ కార్డుల పంపిణీ - కొత్త రేషన్​ కార్డులు

నూతన రేషన్​ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు.

New Ration Cards
కొత్త రేషన్​ కార్డులు
author img

By

Published : Jul 25, 2021, 9:33 PM IST

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు ప్రతి మండలం కేంద్రంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించనున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పెండింగ్ ధరఖాస్తు కూడా లేకుండా అన్నింటిని పరిశీలించి కార్డులు జారీ చేసినట్లు ఆయన వివరించారు.

కొత్తగా మూడు లక్షల తొమ్మిది వేల 83 రేషన్​ కార్డులు

రాష్ట్రవ్యాప్తంగా 4,15,901 కుటుంబాలు కొత్తకార్డులకు ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకున్నాయి. సాంకేతిక విభాగం వడపోత తరువాత 3,91,112 దరఖాస్తులను పరిశీలనకు తీసుకున్నారు. గడిచిన కొన్ని రోజులుగా పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు అర్జీదారుల ఇంటింటికీ వెళ్లి స్థితిగతుల్ని పరిశీలించారు. చివరికి మూడు లక్షల తొమ్మిది వేల 83 కుటుంబాలకు కొత్త రేషన్​ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 8,65,430 మంది లబ్ధి పొందనున్నారు. వీరికి ప్రతి నెల 6కిలోల బియ్యం ఇవ్వనున్నారు. ఇందుకు నెలకు 5,200 మెట్రిక్ టన్నులు బియ్యం అదనంగా అవసరం అవుతాయని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి ఏడాదికి 62,400 మెట్రిక్ టన్నుల కోటా ఉండగా ఇందుకు అదనంగా ఇస్తున్న రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల14 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందన్నారు.

ఏడాదికి రూ.2,766 కోట్ల రూపాయలు ఖర్చు

నూతన రేషన్ కార్డుల్లో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ జిల్లాలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 87.41 లక్షల కార్డులు ద్వారా 2 కోట్ల 79 లక్షల 23 వేల మంది లబ్ధిపొందుతున్నారని... నూతన కార్డులతో కలిపితే 90.50 లక్షలు కార్డులు తద్వారా 2 కోట్ల 88 లక్షల మంది లబ్ధి పొందుతారని తెలిపారు. ప్రతినెల దాదాపు రూ. 231 కోట్లు వ్యయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,766 కోట్ల రూపాయల్ని ప్రజా పంపిణీ కోసం వెచ్చిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. 'బిగ్​బాస్'​ నటికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.