ETV Bharat / state

సైబర్ క్రైమ్స్​లో మొదటి స్థానంలో తెలంగాణ - ఆర్థిక నేరాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ మనమే

NCRB Telangana State Report : సైబర్‌ నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలో, ఆర్ధిక నేరాల్లో కూడా అగ్రస్థానంలో ఉంది. 2022 ఏడాదిలో దేశంలో నేరాలకు సంబంధించి జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా నివేదికను విడుదల చేసింది.

Telangana State Tops In Cyber Crimes
NCRB Telangana State Report
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 8:43 AM IST

సైబర్‌ నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం

NCRB Telangana State Report : సైబర్‌ నేరాల్లో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వార్తల వ్యాప్తి చేయడంలోనూ.. రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం కలకలం రేపుతోంది. ఆర్థిక నేరాల్లోనూ అగ్రస్థానంలో ఉంది. దేశంలో నమోదయిన నేరాలకు సంబంధించి 2022 ఏడాది నివేదికను జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్​సీఆర్​బీ విడుదల చేసింది.

Cyber Crime Cases in Hyderabad : లైక్​ కొడితే రూ.200 అని ఆశచూపి.. రూ.59 లక్షలు దోచేశారు

Telangana Tops In Cyber Crimes : రాష్ట్రంలో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఎన్​సిఆర్​బి 2022 లో దేశంలో నమోదైన నేరాల నివేదికలో ఆ విషయం వెల్లడైంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బాధితులు సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్నారు. పోలీసులు అనేకమార్లు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నా పలువురు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని జేబులు గుళ్లచేసుకుంటున్నారు. మహిళలపై నేరాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. నకిలీ వార్తల వ్యాప్తిలోనూ దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

Loan App Harassment Hyderabad : లోన్​ యాప్​ డౌన్​లోడ్ చేసుకుంటున్నారా.. బీ కేర్​ఫుల్ బ్రదర్​!

Telangana Tops in Financial Crimes : సైబర్‌నేరాలకు సంబంధించి..రాష్ట్రంలో 15వేల 297 కేసులు నమోదుతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. మోసాలకు సంబంధించి బ్యాకింగ్‌లో 3వేల 223 నేరాలు నమోదుకాగా మొదటి స్థానంలో ఉంది. ఎటిపి మోసాలకు సంబంధించి 2,179, చీటింగ్‌లో 4,467 కేసులు నమోదై తొలి స్థానంలో ఉంది. ఏటీఎం మోసాల్లో 624 కేసులు నమోదుతో రెండోస్థానంలో ఉంది. బెదిరించి వసూళ్లుకి సంబంధించి 447 కేసులతో మూడోస్థానంలో ఉంది. లైంగిక వేధింపులు కేసులు 152 నమోదై దేశంలో రాష్ట్రం 7వ స్థానంలో ఉంది.

Telangana Tops in Spreading Fake News : చోరీలకు సంబంధించి 15,854, 6వేల 650 వాహనచోరీల కేసులతో 8వ స్థానంలో ఉంది. దోపిడీలకి సంబంధించి 520, నమ్మకద్రోహంపై 595, అక్రమ నిర్భంధం 1372, అపహరణలు 2981, పిల్లల అపహరణలు 700కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపులు 1787, మనుషుల అక్రమ రవాణా 233, ఆహారకల్తీ 1635, నకిలీ వార్తల వ్యాప్తిపై 264 కేసులు నమోదైనట్లు తేలింది.

కనిపించకుండాపోవడంలో 22,701, మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద 1279 ఆత్మహత్యకు ప్రేరేపించడంపై 375, 137 వరకట్న మరణాలు, 470 లైంగిక దాడి 814 అత్యాచారం, 2752 పోక్సో కేసులు రాష్ట్రంలో నమోదైనట్లు ఎన్​సీఆర్​బీ నివేదికలో పేర్కొంది. సైబర్‌ నేరాలకు సంబంధించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నా కేసులు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

NCRB : 'ఆన్​లైన్​ పిటిషన్‌లను ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చడంలో తెలంగాణ నంబర్ వన్'

జైళ్లలో సమస్యల మేట- ఖైదీలకు తీవ్ర ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.