ETV Bharat / state

మారిన నారాయణాద్రి ఎక్స్​ప్రెస్​ ప్రయాణ వేళలు....

author img

By

Published : Oct 2, 2019, 8:06 AM IST

నారాయణాద్రి ఎక్స్​ప్రెస్​ ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త వేళలు ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. లింగపల్లిలో 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనున్న విషయాన్ని ప్రయాణికులు గమనించాల్సిందిగా అధికారులు కోరారు.

NARAYANADRI TRAIN TIMINGS CHANGED SAID SOUTH CENTRAL RAILWAYS

లింగంపల్లి- తిరుపతి నారాయణాద్రి ఎక్స్​ప్రెస్​ ప్రయాణ వేళలు మారాయి. కొత్త షెడ్యూల్ ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. లింగంపల్లి స్టేషన్​ నుంచి సాయంత్రం 5.15 కి బదులుగా... 5.30కి బయలుదేరుతుంది. బేగంపేటకు సాయంత్రం 5.50కి, సింకింద్రాబాద్​ 6.15, బీబీనగర్​ 7.40 , నల్గొండ 5 గంటలకు, మిర్యాలగూడ 8.24, నడికుడు 8.57, పిడుగురాళ్ల 9.18, సత్తెనపల్లి 9.47, గుంటూరుకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. తెనాలి, రేణిగుంట స్టేషన్ల మధ్య ప్రయాణవేళల్లో తేడా లేదు. తిరుపతికి ఉదయం 6.05 కి బదులు 6 గంటలకు చేరుకుంటుంది. గుంటూరులో 15 నిమిషాలకు బదులు 10 నిమిషాలు ఆగుతుంది.

ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.