ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గాంధీనగర్ డివిజన్ తెరాస నాయకురాలు అరుణశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మొక్కవోని దీక్షతో...
మారుతున్న ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గోపాల్ అభినందించారు. కరోనా విపత్కర సమయంలో దివ్యాంగులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మ , పార్టీ డివిజన్ ఇంఛార్జ్ ముఠా నరేశ్, లక్ష్మీ గణపతి టెంపుల్ ఛైర్మన్ ముచ్చ కుర్తి ప్రభాకర్, తెరాస యువ నేత ముఠా జైసింహ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : లోక్సభలో బిల్లుల ఆమోదమే కాదు సమస్యలపై చర్చ జరగాలి : నామా