ETV Bharat / state

'ప్రతి ఎస్సీ కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలి' - MMRPS leaders protest

అబిడ్స్​లోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.

MRPS
'ఎస్సీ కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలి'
author img

By

Published : Jan 5, 2021, 4:09 PM IST

ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా బుణాలకు బ్యాంకుతో సంబంధం లేకుండా.. నేరుగా కార్పొరేషన్​ ద్వారానే ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్​తో.. అబిడ్స్​లోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఋణాలు బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు కార్పొరేషన్ ద్వారా ఋణాలు మంజూరు చేయాలన్నారు.

ఈ ఋణాల మంజూరులో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అర్హుల జాబితా కేటాయింపు తదితర అంశాలతో... శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. లాక్​డౌన్ తరువాత రాష్ట్రంలో అన్ని సంస్థలు ప్రారంభమయ్యాయని... కానీ విద్యా సంస్థలు ఎందుకు ప్రారంభించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు తెరవకపోవడం వల్ల.. దళిత బిడ్డలు ఎక్కువ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యా సంస్థలు ప్రారంభించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.