ETV Bharat / state

భైంసాలో అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎంపీ సోయం - Riots in bhainsa latest news

నిర్మల్​ జిల్లాలో జరిగిన అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంపీ సోయం బాపూరావు డిమాండ్​ చేశారు. కత్తులతో పొడుచుకునే సంస్కృతి భైంసాలో రోజురోజుకూ పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

MP Soyam bapurao said Government should be responsible for riots in Bhainsa
భైంసాలో అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎంపీ సోయం
author img

By

Published : Mar 8, 2021, 5:10 PM IST

నిర్మల్​ జిల్లా భైంసాలో జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. ఘర్షణలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వైద్యులను అడిగి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ దాడులు జరిగాయని గుర్తు చేశారు. అప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు ఇలాంటి ఘర్షణలు జరిగేవి కావన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి భైంసా పరిస్థితిని వివరిస్తామన్నారు.

ఇదీ చూడండి: పోలీసుల నిఘా నీడలో భైంసా పట్టణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.