సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో... తక్షణమే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎలా ఉన్నారో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని రేవంత్రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం, గవర్నర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న ఆందోళనను నివృత్తి చేయడానికి వెంటనే హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఎంపీ రేవంత్రెడ్డి ట్వీట్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై గత కొంత కాలంగా వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎంపీ రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. సీఎం ఎలా ఉన్నారో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని... వెంటనే కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో... తక్షణమే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎలా ఉన్నారో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని రేవంత్రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం, గవర్నర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న ఆందోళనను నివృత్తి చేయడానికి వెంటనే హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరారు.
ఇవీచూడండి: పత్తికి 'తెలంగాణ బ్రాండ్'!.. మార్కెటింగ్ శాఖ కసరత్తు