ETV Bharat / state

2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలి: ఆర్.కృష్ణయ్య - National President of the BC Welfare Association

Gurukula PET Results 2017 : హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగ అభ్యర్థులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఆందోళనకు దిగిన ఆయన.. కమిషన్ ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు.

MP R Krishnaiah
MP R Krishnaiah
author img

By

Published : Jan 11, 2023, 9:43 PM IST

Gurukula PET Results 2017 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ.. ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గురుకుల పీఈటీ పోస్టులను కోర్టు ఆదేశాల ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. 2017 గురుకుల పోస్టుల్లో పీఈటీ అర్హత సాధించిన అభ్యర్థులతో కలిసి నాంపల్లిలోని టీఎస్​పీఎస్సీ కార్యలయం ముందు ఆందోళనకు దిగారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్న అభ్యర్థులు.. వారి పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కమిషన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభ్యర్థులకు కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ వెంటనే పీఈటీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫలితాలు వెల్లడించక పోవడంతో మనస్తాపానికి గురై.. చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ జాప్యం చేస్తుందని మండిపడ్డారు. గత ఆరేళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలి: ఆర్. కృష్ణయ్య

"2017 సెప్టెంబర్​లో గురుకుల పోస్టుల పీఈటీ పరీక్షలు రాసినప్పటికీ ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు. 616 పోస్టులకుగానూ 1232 మంది అభ్యర్థులు గతంలో సెలక్ట్ అయ్యారు. అభ్యర్థులకు రోజురోజుకూ కుటుంబ పోషణ భారం అవుతోంది. ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఫలితాలు ప్రకటించాలి. లేని పక్షంలో అభ్యర్థులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తాం."- ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.