ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను నిర్మూలించడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన లాక్డౌన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్టంగా అమలు చేసే విధంగా దృష్టి పెట్టారన్నారు. కరోనా నిర్మూలనలో వైద్య సిబ్బంది, పోలీసులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రజాప్రతినిధులు సైతం గ్రామస్థాయి నుంచి పకడ్బందీ చర్యలు చేపట్టారని తెలిపారు. పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నామా వివరించారు. దిగుబడులు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు.
ఇదీ చూడండి : ఆహారం, కిరాణా సామగ్రి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?