aravind-complaint-to-governor: సొంత నియోజకవర్గంలో పోలీసులు తనకు కనీస భద్రత కల్పించలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో తన హత్యకు ప్రణాళిక జరిగిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దాడి ఘటనపై తనను గవర్నర్ తమిళిసై ఫోన్ చేయగా.. వివరాలు తెలిపానని అర్వింద్ చెప్పారు. దాడి జరిగే అవకాశం ఉందని ముందు రోజు, మరుసటి రోజు తెలిపినా.. రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం చేయలేదని గవర్నర్‌కు చెప్పానన్నారు.
దాడి వివరాలు, నిజామాబాద్ పోలీసు కమిషనర్ ఇతర పోలీసులు వ్యవహారించిన తీరును గవర్నర్‌కు వివరించానని అర్వింద్ తెలిపారు. ఈ మధ్య పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులపై పోలీసుల సమక్షంలోనే .. కొన్నిసార్లు పోలీసులే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చానని చెప్పారు. దాడి ఘటనపై డీజీపీతో పాటు కేంద్ర హోం మంత్రితో చర్చించి, తగు చర్యలకు సూచిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని ఎంపీ అర్వింద్ తెలిపారు.
ఇదీ చూడండి: CM kcr Phone to Chiranjeevi: హలో.. చిరంజీవి గారు.. ఎలా ఉన్నారు..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!