ETV Bharat / state

బీఆర్​ఎస్​తో కొత్త చరిత్ర సృష్టిస్తాం: ఎమ్మెల్సీ కవిత - TRS MLC Kalvakuntla kavitha fire on bjp

MLC Kalvakuntla kavitha comments on bjp: ‘‘భారత్‌ రాష్ట్ర సమితి" ప్రకటనతో బీజేపీ బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో భారత్‌ రాష్ట్ర సమితితో కొత్త చరిత్ర సృష్టిస్తామన్న ఆమె.. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన కవిత.. బతుకమ్మను, మహిళలను బండి సంజయ్‌ అవహేళన చేస్తున్నారని ఆరోపించారు.

kalvakuntla kavitha
కల్వకుంట్ల కవిత
author img

By

Published : Dec 13, 2022, 4:43 PM IST

Updated : Dec 13, 2022, 5:37 PM IST

MLC kavitha comments on bjp: దేశంలో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్​ఎస్​)తో కొత్త చరిత్ర సృష్టిస్తామని టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. మహిళలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అవహేళన చేస్తున్నారని కవిత ఆరోపించారు. సరైన సమయంలో భాజపాకు బుద్ధి చెబుతామన్నారు. బతుకమ్మను కూడా బండి సంజయ్‌ అవమానించారన్నారు.

యాగాలు చేయడం కేసీఆర్‌కు కొత్త కాదు.. ‘‘భారత్‌ రాష్ట్ర సమితి ప్రకటనతో భాజపా బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది. ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్‌ నన్ను అవహేళన చేశారు. పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలోనూ ఆ పార్టీకి బుద్ధి చెప్తారు. యాగాలు చేయడం సీఎం కేసీఆర్‌కు కొత్త కాదు. భారాసకు దైవశక్తి అవసరం కాబట్టే యాగాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో మా పార్టీలోకి చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయి. జాతీయ స్థాయిలో భాజపాకు భారాస ప్రత్యామ్నాయం కాబోతోంది. భాజపా వ్యతిరేక కూటములను ఏకం చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాలను ఖరారు చేస్తాం.

అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా వెళ్లి ఓడిస్తా.. భాజపా రణనీతిలో దర్యాప్తు సంస్థలు భాగమని ప్రజలకు తెలుసు. ఆ విషయంలో భయపడేది లేదు. భారత్‌ జాగృతి ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి యథావిధిగా కొనసాగుతుంది. ఏపీలో ఎన్నికలకు సమయం ఉన్నందున ఇంకా అక్కడ మా వ్యూహాలు ఆలోచించలేదు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా. భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఆయన్ను ఓడిస్తా’’ అని కవిత వ్యాఖ్యానించారు. నిన్న పార్లమెంటులో భాష విషయంలో నిర్మలాసీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. నిర్మలా సీతారామన్ వీక్ హిందీ గురించి కాకుండా.. వీక్ రూపి గురించి స్పందిస్తే మంచిదని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 13, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.