ప్రజలు ఎక్కడైతే అణిచివేయబడతారో... అక్కడ సాహిత్యం ఉజ్వలంగా ఉంటుందని ప్రముఖ జనవాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో... ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 'తెలంగాణ సాహిత్యం నాడు - నేడు' అనే అంశంపై జరిగిన సదస్సులో గోరటి వెంకన్న ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆది నుంచి తెలంగాణ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితుల కారణంగా సాహిత్యానికి ప్రాముఖ్యత ఉందని ఆయన తెలిపారు.
కొత్తతరం సాహితీ వేత్తలు అనుసరించి రచనలు చేసే సంస్కృతి నుంచి తమలోని సృజనాత్మకతతో రచనలు చేసే నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని గోరటి వెంకన్న కోరారు. గత పదేళ్లలో ప్రపంచస్థాయిలో మంచి సాహిత్యం ఏదైనా వస్తుందంటే... అది తెలంగాణ రాష్ట్రంలోని సాహితివేత్తలకే ఆ ఘనత దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పుల్వామా అమర సైనికులకు కవుల నివాళి అంటూ గంటా జలంధర్ రెడ్డి రచించిన 'ఎవరెస్టు కన్నా ఉన్నతం' అనే పుస్తకాన్ని గోరటి వెంకన్న ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా