ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న నందు అక్రమాల బాగోతాలు - తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న నందు అక్రమాలు

MLAs Poaching Case Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందుకు సంబంధించిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. పలువురిని మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు... అతను ఇచ్చిన పదుల సంఖ్యలో చెక్కులు బౌన్స్‌ అయినట్లు తేల్చారు. పూజలతో ప్రముఖులను బుట్టలో వేసుకొని లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించారు.

MLAs Poaching Case
MLAs Poaching Case
author img

By

Published : Dec 12, 2022, 6:46 AM IST

Updated : Dec 12, 2022, 10:34 AM IST

వెలుగులోకి ఎమ్మెల్యే ఎర కేసు నిందితుడు నందు అక్రమాల చిట్టా

MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందకుమార్‌... అలియాస్‌ నందు అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బహిర్గతమవుతోంది. అతడి బ్యాంకుఖాతాలు, సెల్‌ఫోన్లపై సిట్‌ విశ్లేషణలో.. పలువురితో అతడు సాగించిన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. నందు ఇచ్చిన చెక్కులు పదుల సంఖ్యలో బౌన్స్‌ అయినట్లు ఇప్పటికే సిట్‌ గుర్తించినట్లు తెలిసింది. నందుతో గతంలో ఇబ్బందులకు గురైన బాధితులు... ముఖ్యంగా వ్యాపారభాగస్వాములుగా ఉండి విబేధాల కారణంగా బయటికి వచ్చినవారు, ఆయనతో ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

బాధితులు ఇచ్చే ఆధారాలను పరిశీలిస్తూ నందుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నందు 7 వ్యాపార సంస్థలను నిర్వహించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అతడి మాయమాటలకి మోసపోయినట్లు ఓ గుట్కాసంస్థ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గతంలో ఆ సంస్థ ట్రేడ్‌మార్క్‌పై వివాదంతలెత్తగా.. నిర్వాహకులతో మాట కలిపిన నందు... సంస్థ నిర్వహణ సరిగా లేదని.. అమ్మేందుకు కోట్లలో డీల్‌ మాట్లాడదామని చెప్పి మోసగించినట్లు సమాచారం. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలకు ఎరకేసులో నందకుమార్‌తోపాటు రామచంద్రభారతి, సింహయాజి కటకటాలయ్యారు. రామచంద్రభారతి, సింహయాజిలే కాకుండా... నందు జాబితాలో మరో ఏడుగురు స్వామీజీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేరున్న రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఎంచుకొని వారిని ప్రసన్నం చేసుకునేందుకు స్వామీజీలతో పూజలు చేయించడాన్ని... నందు వ్యాపకంగా పెట్టుకున్నట్లు గుర్తించారు. స్వామీజీలు హైదరాబాద్‌ వచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌చేయడం... విమానాశ్రయం నుంచి కారులో తీసుకురావడం హోటళ్లలో ఆతిథ్యం, పూజల సమయంలో తొలుత ప్రముఖుల తరఫున స్వామీజీలకు భారీగా దక్షిణ ఇవ్వడం.. ఆ తర్వాత అదను చూసి వారితో పనులు చేయించుకోవడం వంటి వ్యవహారాలు భారీగా చేసినట్లు గుర్తించారు. ఈక్రమంలో ఏమైనా మోసాలు చోటుచేసుకున్నాయా? అని ఆరా తీసే పనిలో సిట్‌ నిమగ్నమైంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.