ETV Bharat / state

MLA Tickets Clash in Congress : 'మాకు టికెట్​ ఇవ్వాల్సిందే.. ఇతరులకు ఇస్తే ఊరుకునేది లేదు..' కాంగ్రెస్​కు సీనియర్ల తలనొప్పి

MLA Tickets Fight In Congress : దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకున్నామంటూ ఓ వైపు సీనియర్ల బెట్టు.. వెంటపడి బతిమిలాడి తెచ్చుకున్న నేతలు మరోవైపు పట్టు. ఎన్నికల ముందు ఎవరిని నొప్పించినా.. ఎంతో కొంత నష్టం కలుగుతుందని నాయకత్వం ఆందోళన ఇంకోవైపు. నియోజవర్గానికి ఇద్దరికి పైగా పోటీపడుతున్న చోట అన్ని పార్టీల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నా.. అందులో కాంగ్రెస్‌కు మాత్రం మరింత తలనొప్పిగా మారింది. సర్వేల ఆధారంగానే టికెట్‌ అని చెబుతున్నా.. తమను కాదని కొత్తవారికి ఎలా ఇస్తారంటుండటంతో పాత, కొత్త నేతల మధ్య పోటీ నెలకొంటుంది. మరోవైపు 60 సీట్లకు పైగా తమకు కేటాయించాలంటూ హస్తం నాయకత్వంపై బీసీ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు.

Telangana Congress MLA Tickets Fight
MLA Tickets Fight In Congress
author img

By

Published : Aug 20, 2023, 8:45 AM IST

MLA Tickets Clash in Congress : 'మాకు టికెట్​ ఇవ్వాల్సిందే.. ఇతరులకు ఇస్తే ఊరుకునేది లేదు..' కాంగ్రెస్​కు సీనియర్ల తలనొప్పి

MLA Tickets Fight In Congress : రాష్ట్రంలో కాంగ్రెస్​ అభ్యర్థుల ఖరారుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో టికెట్ల కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. తలపండిన పలువురు సీనియర్‌ నేతలు తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇతరులకు టికెట్లిస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరికలకు దిగుతున్నారు. గతంలో పోటీ చేసి, ఓడిన ఇలాంటి వారిలో కొందరికి టికెట్‌ ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో గెలిచే సత్తా లేదని పార్టీ ఆందోళన చెందుతోంది.

దాంతో తమ అనుచరులకైనా ఇప్పించుకోవడానికి మరికొందరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ (Telangana congress)​లో చేరిన, చేరతారని ప్రచారం జరుగుతున్న కొందరు నేతలు కూడా టికెట్ల కోసం పట్టుబడుతున్నాయి. దీంతో పలు నియోజకవర్గాల్లోని సీనియర్లు అందుకు ససేమిరా అంటున్నారు. ఇంతకాలం పార్టీని కాపాడిన తమను వదిలేసి కొత్తవారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

MLA Tickets Fight In Telangan Congress : ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి.. కొత్తగా పార్టీలో చేరిన ఓ నేత ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాల్లో తనవారికి టికెట్లు అడుగుతున్నారని.. ఆయన చెప్పిన వారికి టికెట్లిస్తే ఇంతకాలం పార్టీలో ఉన్నవాళ్లు ఏమవ్వాలంటూ అసహనం వ్యక్తం చేయటం పాత, కొత్త నేతల మధ్య పోటీని చాటుతోంది. నాగర్‌కర్నూల్‌లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదరరెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే స్థానంలో టికెట్​ అడిగే విషయంపై తన అనుచరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని నాగం తెలిపారు. కొల్లాపూర్​లోనూ సీనియర్​ నేత జగదీశ్వర్​రావు టికెట్​ ఆశిస్తున్నందున పార్టీ బుజ్జగింపు చర్యలు తీసుకుంది.

అక్కడ బీఆర్​ఎస్​ నుంచి వచ్చిన జూపల్లి కృష్ణారావు రేసులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక జడ్చర్లలో సీనియర్‌ నేత వర్గానికి చెందిన మరొకరు పోటీకి రావడాన్ని మాజీ ఎమ్మెల్యే జీర్ణించుకోవడం లేదు. జోగులాంబ-గద్వాల నియోజకవర్గంలో కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్​ఎస్​ నేత టికెట్‌ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని అక్కడున్న పాత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telangana Congress Applications From MLA Ticket Aspirants : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్​కు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది

Telangana Assembly Election 2023 : జనగాయమ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్ష పదవిని తనను సంప్రదించకుండా కొమ్మూరి ప్రతాప్​రెడ్డికి ఇవ్వడంపై.. సీనియర్​ నేత పొన్నాల లక్ష్మయ్య ఏఐసీసీకే ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంజయ్‌ టికెట్‌ తనకే వస్తుందనే ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అక్కడ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉండగా.. కొత్తవారికి ఎందుకిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు.

65 స్థానాలు బీసీలకే ఇవ్వాలి : ఇదిలా ఉండగా.. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున 34 టికెట్లను బీసీలకు ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. అంతకు మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీసీ నాయకులు నిన్న గాంధీభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 65 చోట్ల బలమైన బీసీ నేతలు పోటీకి సిద్ధంగా ఉన్నారని.. అలాగే, స్క్రీనింగ్‌ కమిటీలోనూ బీసీలకు చోటు కల్పించాలని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిని కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీసీలకిచ్చే సెగ్మెంట్లపై చర్చ జరుగుతోంది.

Congress MLA Ticket Applications : కాంగ్రెస్‌ రేసుగుర్రాల ఎంపిక.. తొలిరోజు 18 దరఖాస్తులు

Telangana Congress MLAs Tickets : వీటిలో ఒకటి నిజామాబాద్‌ అర్బన్‌ అయితే రెండో టికెట్‌ బాల్కొండ లేదా ఆర్మూర్‌లో ఇవ్వాల్సి ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఆర్మూర్​ను బీసీలకిస్తే తనకు టికెట్​ ఇవ్వాలని.. నిజామాబాద్​ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఒకరు గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు ఇంకో ప్రధాన పార్టీ నుంచి కాంగ్రెస్​లో చేరిన కొత్త ఓసీ నేత టికెట్​ కోరుతున్నారు. ఆయనకు టికెట్‌ దక్కితే ఓసీ కోటా కిందికి పోతుంది.

అప్పుడిక అనివార్యంగా బాల్కొండను బీసీలకు కేటాయించాల్సి వస్తుందని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా పలు స్థానాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించే వారి నుంచి రెండోరోజైన శనివారం 30 దరఖాస్తులు అందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దరఖాస్తు దాఖలుకు ఈ నెల 25 వరకు గడువు ఉన్నందున అప్పటికి బాగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Congress Chevella Praja Garjana Sabha : ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభ.. SC, ST డిక్లరేషన్​ విడుదల చేయనున్న ఖర్గే

MLA Jaggareddy on Party Change Rumors : పార్టీ మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..! క్లారిటీ ఇదిగో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.