హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న పండ్ల మార్కెట్‌ను బీజేఆర్ భవనం వెనక ఉన్న 11 ఎకరాల స్థలంలోకి తరలించడం జరిగిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. త్వరలోనే ఈ స్థలంలో మామిడి, సంత్ర, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి వంటి ఇతర పండ్ల విక్రయాలు కూడా జరుగుతాయని ఆయన తెలిపారు. ఈరోజు నుంచి విక్రయాలు మొదలు పెట్టినప్పటికీ రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులతోపాటు కరోనా దృష్ట్యా తగిన చర్యలు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
నిత్యం సుమారు 15 వేల మంది మార్కెట్ రావడం జరుగుతుందని.. అందుకు అనుగుణంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే లారీలకు వినియోగదారులకు సంబంధించిన వాహనాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారుల అంతా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించి.. కొనుగోలు చేయాలని కోరారు. స్థలం ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారులు దూరం దూరంగా తమతమ స్థలాలను కేటాయించుకోవాలన్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని అటు విక్రయదారులు, ఇటు వినియోగదారులు, పోలీసులు, మార్కెట్ పాలకమండలి సమన్వయంతో పనిచేయాలని కోరారు.
"కరోనా వ్యాప్తిని నివారణ చర్యల్లో భాగంగా మార్కెట్‌ను ఇక్కడి తరలించాం.. మార్కెట్లో వాష్బెషీన్లను కూడా ఏర్పాటు చేేశాం.. క్రయవిక్రయాలు చేసేటప్పుడు ప్రజలందరూ చేతులను శుభ్రంగా కడుక్కుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలి- ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి"