నటి, రాజకీయ నాయకురాలిగా రెండు పాత్రల్లోనూ.. రోజా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తోందని గవర్నర్ తమిళిసై కొనియాడారు. హైదరాబాద్‌లో రవీంద్రభారతిలో లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవ జనార్దన పారిజాతం ఆంధ్ర నాట్య ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా తన నాట్య ప్రదర్శనతో ఆహుతులను అలరించారు. రోజా, సెల్వమణి దంపతులను గవర్నర్ సన్మానించారు.
ఇదీ చూడండి : 15ఏళ్లకు తిరిగొచ్చిన కొడుకు.. ఆకాశాన్నంటిన సంబరం