ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మైనంపల్లి - groceries distribution

సికింద్రాబాద్​ అల్వాల్​లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడని ఆయన అన్నారు.

mla mynampalli hanumantha rao groceries distribution in hyderabad
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 2, 2020, 5:22 PM IST

అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్​ అల్వాల్​లోని వీబీఆర్ గార్డెన్​లో పేద ప్రజలకు మైనంపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ 500 మంది పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామని హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచే క్రమంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రాజెక్టులను ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో దాదాపు 70 రోజుల నుంచి లక్షలాది మందికి ఆహార ప్యాకెట్లను, నిత్యావసర సరుకులను అందజేసి వారి ఆకలి తీర్చామని అన్నారు.

ఇవీ చూడండి: 'కాంగ్రెస్ జలదీక్షకు మరో రోజు దొరకలేదా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.