కార్వాన్ నియోజకరవర్గ ఎమ్మెల్యే కౌసర్ మెుహినుద్దీన్ తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తిపై దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సదరు వ్యక్తిని ఎందుకు మద్యం సేవించావు అంటూ ఆయన కర్రతో కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. అయితే తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకొని మద్యం సేవించినందుకే తనను కొట్టినట్లు బాధితుడు చెప్పుకొచ్చాడు.
ఇవీ చూడండి: భాజపాలోకి వలసల పరంపర