జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం... తెలంగాణలో గ్రామీణ ప్రగతి, పల్లె ప్రగతి పేరుతో గ్రామాల అభివృద్ధి జరుగుతున్నట్లు ఆయన అన్నారు. సికింద్రాబాద్లోని ఎంజీరోడ్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి చేస్తామని అన్నారు.
ఇదీ చూడండి: 'మహాత్ముని అడుగుజాడల్లో నడవడమే నేటితరం ఆయనకిచ్చే ఘననివాళి'