Srinivas Goud On Excise dept: అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త్వరలోనే ఎక్సైజ్‌శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్‌శాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
గుడుంబా రహిత రాష్ట్రమే లక్ష్యం
Excise gazetted officers: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణను గుడుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని గెజిటెడ్ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, అసోషియేషన్ అధ్యక్షులు రవీందర్‌రావు ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.