ETV Bharat / state

గిరిజన రిజర్వేషన్లపై భాజపా నేతలవి మోసపూరిత హామీలు: సత్యవతి రాఠోడ్​

Satyavathi rathod fire on Bjp: గిరిజన రిజర్వేషన్ల పట్ల భాజపా నేతలు మోసపూరిత హామీలు ఇస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్​ ఆరోపించారు. వారం రోజుల్లోగా రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు జీవో వస్తుందని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి మేలు చేస్తోందన్నారు.

Satyavati Rathode
Satyavati Rathode
author img

By

Published : Sep 18, 2022, 2:05 PM IST

Updated : Sep 18, 2022, 2:44 PM IST

Satyavathi rathod fire on Bjp: ఎనిమిదేళ్లలో గిరిజనుల కోసం ఎవరు కృషి చేశారో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లుగా తమ తీర్మానం ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్ల పట్ల భాజపా నేతలు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లోగా రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు జీవో వస్తుందని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి మేలు చేస్తుందన్నారు.

గిరిజనులపై నిజంగా భాజపా నేతలకు ప్రేమ ఉంటే ఆనాటి విభజన హామీలు ఎందుకు పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. గిరిజనులకు ఎన్నో ఉపాధి అవకాశాలు తెచ్చిపెట్టే కాజీపేట​ కోచ్​ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మగారం, గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు మరిచారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఐదేళ్లుగా మనం ఇచ్చిన తీర్మానం పక్కన పెట్టుకొని దానిని అమలు చేయకుండా ఇక్కడికి వచ్చి భాజపా అధికారం చేపట్టితే జీవో ఇస్తామని మోషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. గిరిజనులపై నిజంగా భాజపా నేతలకు ప్రేమ ఉంటే విభజన హామీల చట్టాల ప్రకారం గిరిజనులకు ఏం చేశారు. కాజీపేట​ కోచ్​ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మగారం, గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు మరిచారు. వారం రోజుల్లోగా రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు జీవో వస్తుంది. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి మేలు చేస్తుంది. ప్రజలు దీనిని గుర్తుంచుకోవాలి.-సత్యవతి రాఠోడ్​, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Sep 18, 2022, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.