ETV Bharat / state

'ఏప్రిల్​ చివరినాటికి ఈఎస్​ఐ ఆస్పత్రి అందుబాటులోకి' - హైదరాబాద్​ తాజా వార్తలు

నాచారంలో నూతనంగా నిర్మిస్తున్న ఈఎస్​ఐ ఆస్పత్రిని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. నూతన భవనాన్ని ఏప్రిల్​ చివరినాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

minister mallareddy visited esi hospital
'ఏప్రిల్​ చివరినాటికి ఈఎస్​ఐ ఆస్పత్రి అందుబాటులోకి'
author img

By

Published : Mar 2, 2020, 9:01 PM IST

నాచారం వద్ద నూతనంగా నిర్మిస్తున్న 400 పడగల ఈఎస్​ఐ ఆస్పత్రిని ఏప్రిల్​ చివరినాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ శాంతి శేఖర్ ఈఎస్​ఐ సూపరింటెండెంట్​ గీత ఇతర అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు.

నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రిలో కార్పొరేట్​ ఆస్పత్రులకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైందని త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే రోగుల కష్టాలు తీరుతాయని ఆస్పత్రి సూపరింటెండెంట్​ గీత ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఏప్రిల్​ చివరినాటికి ఈఎస్​ఐ ఆస్పత్రి అందుబాటులోకి'

ఇదీ చూడండి : హైదరాబాద్‌, దిల్లీలో కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.