మంత్రి మల్లారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంత్రి ఓఎస్డీ సుధాకర్ రెడ్డి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా, అసత్య కథనాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారంటూ ఆయన అనుచరులు, కార్యకర్తలు ఓఎస్డీ దృష్టికి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
ఇవీ చూడండి: ఒమన్ దిశగా 'వాయు' తుపాను