ETV Bharat / state

అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్​: మంత్రి మల్లారెడ్డి

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ ​రావు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్​ను రూపొందించారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా పెద్ద మొత్తంలో నిధులను కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్​లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీఎం కేసీఆర్​ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

minister Mallareddy anointed CM KCR to paint in hyderabad
అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్​: మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Mar 19, 2021, 3:28 PM IST

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ ​రావు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్​ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్​ను రూపొందించాని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ బడ్జెట్​లో మండల, జిల్లా పరిషత్​లకు రూ. 500 కోట్లు కేటాయించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా పెద్ద మొత్తంలో నిధులను కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ మండలాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రైవేటు సంస్థలకు దీటుగా విజయ డైరీని నడిపిస్తున్నాం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.