Minister KTR on Women Reservations Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై లోక్‌సభలో చర్చ జరుగుతున్న వేళ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ టెక్‌పార్క్(International TechPark)ను ప్రారంభించిన మంత్రి.. ఈ మేరకు మహిళా బిల్లుపై స్పందించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మన జీవితాలు చాలా చిన్నవని.. అందులో తన పాత్ర తాను పోషించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలులో తన సీటు పోయినా.. వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతకు ముందు టెక్‌పార్క్‌ను ప్రారంభించిన తర్వాత విదేశీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను సత్కరించారు.
"మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నాను. మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్లలో నా సీటు పోతే పోనివ్వండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మన జీవితాలు చాలా చిన్నవి.. నా పాత్ర నేను పోషించాను." - కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
KTR on Women Reservations Bill : రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం ఎన్నో సమస్యలను మేము లేవనెత్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై అందరు కలిసి నిలబడాలని ఆయన ఎక్స్(Twitter) వేదికగా కోరారు. మంగళవారం పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు భారతీయ పౌరుడిగా గర్విస్తున్నానని ఆయన తెలియజేశారు.
"మహిళా బిల్లు పట్ల భారతీయుడిగా గర్వపడుతున్నా. మహిళా బిల్లు కోసం బీఆర్‌ఎస్ కూడా ఎన్నో పోరాటాలను చేసింది. అందుకు తగిన కృషి చేశాము. మహిళా బిల్లును స్వాగతిస్తున్నాము. మైలురాయి చట్టానికి మద్దతిచ్చే అన్ని పార్టీలకు ధన్యవాదాలు. చాలా ఏళ్ల క్రితమే స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేశాము." - కేటీఆర్, ట్వీట్
-
There are certain occasions when we have rise above politics, stand together on issues that matter in the larger interest of the Country
— KTR (@KTRBRS) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Today I am proud as an Indian citizen that our Parliament has taken into consideration the passage of #WomenReservationBill 👏
My…
">There are certain occasions when we have rise above politics, stand together on issues that matter in the larger interest of the Country
— KTR (@KTRBRS) September 19, 2023
Today I am proud as an Indian citizen that our Parliament has taken into consideration the passage of #WomenReservationBill 👏
My…There are certain occasions when we have rise above politics, stand together on issues that matter in the larger interest of the Country
— KTR (@KTRBRS) September 19, 2023
Today I am proud as an Indian citizen that our Parliament has taken into consideration the passage of #WomenReservationBill 👏
My…
KTR Happy About Approval of Women Bill in Parliament : మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీల వారందరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కోసం సీఎం కేసీఆర్ నిర్దేశించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం కూడా దీనిని సాకారం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినందుకు సంతోషం, గర్వంగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని ఆయన గుర్తించారు. జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, గ్రామ పంచాయతీల్లో అమలు చేశామని పేర్కొన్కారు.