ETV Bharat / state

KTR On BJP Corporators GHMC Attack: 'గాడ్సే అభిమానులను గాంధీ మార్గంలో నడవమని కోరడం అత్యాశే'

జీహెచ్​ఎంసీ కార్యాలయంపై భాజపా కార్పొరేటర్ల దాడిపై( BJP Corporators Attack) మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి చర్యలు సరికావన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీని కేటీఆర్‌ కోరారు.

KTR On BJP Corporators GHMC Protest, ktr twitter
భాజపా దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్
author img

By

Published : Nov 24, 2021, 3:32 PM IST

KTR On BJP Corporators GHMC Protest: జీహెచ్​ఎంసీ కార్యాలయంపై భాజపా కార్పొరేటర్లు మంగళవారం చేసిన దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. భాజపాకు చెందిన పోకిరీలు, దుండగులు కార్యాలయంలో దాడిచేశారన్న మంత్రి... ఇలాంటి చర్యలు సరికావన్నారు. గాడ్సే అభిమానులను గాంధీ మార్గంలో నడవమని కోరటం అత్యాశే అవుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.... దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీని కేటీఆర్‌ కోరారు. ఈ దాడి ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు.

  • Some thugs & hooligans of BJP in Hyderabad have vandalised the GHMC office yesterday. I strongly condemn this atrocious behaviour

    Guess it’s too much to ask Godse Bhakts to behave in a Gandhian manner

    Request @CPHydCity to take strictest action on the vandals as per law pic.twitter.com/0Ogg0IzLZS

    — KTR (@KTRTRS) November 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏం జరిగింది?

హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ... మేయర్‌ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేయటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం (BJP corporators besiege GHMC headquarters) ఏర్పడింది. కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని, కార్పొరేటర్ల ఫండ్ విడుదల చేయాలని భాజపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 5 నెలల క్రితం వర్చువల్‌ మీటింగ్‌ పెట్టినా... పనులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ మేయర్‌ ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని... లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మేయర్ స్పందన

నగరంలో తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే భాజపా కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేశారని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు. జీహెచ్​ఎంసీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. భాజపా కార్పొరేటర్లు ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లే కౌన్సిల్ సమావేశం నిర్వహించలేకపోయామని ఆమె తెలిపారు. ఎవరి ఆదేశాలతో తన కార్యాలయంపై దాడి చేశారని కార్పొరేటర్లను మేయర్(ghmc mayor on bjp Corporators) ప్రశ్నించారు. భాజపా కార్పొరేటర్లు ఏ ప్రశ్న అడిగినా తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని డివిజన్లలో తాను పర్యటించానని వెల్లడించారు. కరోనా వల్ల వర్చువల్‌ సమావేశాలు నిర్వహించామని.. వారు తన వద్దకు వచ్చి ఏ సమస్య ఉన్నా అడగవచ్చని సూచించారు. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే ఊరుకోమని విజయలక్ష్మి హెచ్చరించారు. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: BJP ATTACK BC BHAVAN: బీసీ భవన్ ముట్టడికి భాజపా యత్నం.. అరెస్టు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.