ఆంధ్రప్రదేశ్లో వరుస పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు, తయారీ యూనిట్లలో భద్రతా ప్రమాణాలను యుద్ధప్రాతిపదికన తనిఖీ పూర్తి చేయాలని పరిశ్రమలశాఖ కార్యదర్శికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిశీలనను వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. సరైన భద్రతా ప్రమాణాలను పాటించని పరిశ్రమల పట్ల ఉదాసీనంగా ఉండేది లేదని.. కఠిన చర్యలు చేపడతామని ఈ మేరకు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.