Minister Harish Rao Review On Health : సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Health Minister Harish Rao) స్పష్టం చేశారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 7,988 డెంగీ కేసులు నమోదైతే.. ఈ ఏడాది అదే సమాయానికి 5,263 కేసులు నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.
Seasonal Diseases In Telangana 2023 : వర్షాకాలం వస్తే గతంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు విపరీతంగా ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో అమలు చేసిన పల్లె ప్రగతి(Palle Pragathi), పట్టణ ప్రగతి(Pattana Pragathi), మిషన్ భగీరథ(Mission Bhagiratha) వంటి పథకాలతో రాష్ట్రంలో పరిసరాల పరిశుభ్రత పెరిగి సీజనల్ వ్యాధులు(Seasonal Diseases) గణనీయంగా తగ్గాయని మంత్రి వివరించారు.
అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గడిచిన వారం, పది రోజుల సమయంలో ఫీవర్ కేసులు(Fever Cases) స్వల్పంగా పెరుగుదల ఉన్నట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయన్నారు. మనం మరింత అప్రమత్తంగా ఉంటే ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మలేరియా, డెంగీ కేసుల విషయంలో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Harish Rao Review On Viral Fevers Spreading in Telangana : జ్వర లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital) వద్దకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని పేర్కొన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందులు పల్లె దవాఖానాలు మొదలుకొని అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. డెంగీ, మలేరియా కేసుల విషయంలో ఎర్లీ టెస్టింగ్, ఎర్లీ ట్రీటింగ్ ముఖ్యమైందని కాబట్టి, వ్యాధి నిర్ధారించే ఎన్ఎస్1 కిట్స్(NS1 Kits), ఐజీఎం కిట్స్(IGM Kits) అందుబాటులో ఉండాలని చెప్పారు.
Seasonal Diseases in Telangana : వాతావరణంలో మార్పులు.. జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు
Dengue and Malaria Cases Increase in Telangana : ప్రస్తుతానికి ఎన్ఎస్1 కిట్స్ 1,099, ఐజీఎం కిట్స్ 992 ఉన్నాయని.. అలాగే మలేరియా ఆర్డీటీ కిట్స్(RDT Kits) మొత్తంగా 7 లక్షల 6 వేలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎక్కడా కొరత లేకుండా చూడాలని టీఎస్ఎంఎస్ఐడీసీ(TSMSIDC)ని మంత్రి ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చే వారికి స్వల్ప లక్షణాలు ఉన్నా.. చేర్చుకొని చికిత్స అందిచాలని కోరారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు.
Harish Rao on Dengue and Malaria Cases : వైరల్ ఫీవర్ వస్తే అవసరమైన పరీక్షలు నిర్వహించి.. కాంప్లికేటెడ్ కేసులను గుర్తించి ప్రధాన ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మలేరియా, డెంగీతో ఒక్క పేషెంట్ కూడా మృతి జరగకుండా వైద్యారోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. దీనిపై ప్రజలు సైతం బాధ్యతగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని.. దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో పంచాయతీ, మున్సిపల్ శాఖల, స్థానిక సంస్థల సమన్వయంతో ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జూమ్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
Viral Fevers in Gadwal District : విజృంభిస్తున్న విషజ్వరాలు.. ఆ ఊళ్లో సగానికి పైగా బాధితులే