HARISH RAO ON BUDGET: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు చేయలేని వాటిని కేవలం ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం చేసి చూపిందని వెల్లడించారు. ఇవాళ శాసనమండలి సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు సమాధానమిచ్చారు. రాష్ట్ర రెవెన్యూ ఆదాయాన్ని పెంచేందుకు తాము కృషి చేసినట్లు వెల్లడించారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఖర్చు పెట్టే విషయంలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచిందని వెల్లడించారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల నియోజకవర్గాల్లో రూ.800 కోట్లు బడ్జెట్లో కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు అధిక మొత్తంలో బడ్జెట్లో నిధులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమానికి 'గ్రీన్ ఫండ్' పేరుతో నిధుల్లో 10 శాతం ఖర్చు పెట్టేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ఇది దేశానకే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
విద్యుత్ రంగానికి అధిక నిధులు
ఈ ఏడాది బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు కూడా నిధులు పెంచినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ రంగానికి ఏడేళ్లలో రూ.43,574 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. వైద్యరంగానికి పెద్దమొత్తంలో బడ్జెట్లో నిధులు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: