రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం(paddy procurement in telangana) వర్షాలకు తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4వేల 39 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల(minister gangula kamalakar) కమలాకర్ తెలిపారు. గతేడాది ఇదే సీజన్‌లో నవంబరు 13వరకు దాదాపు 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం(paddy procurement in telangana) సేకరించామని గంగుల వెల్లడించారు. ఈ సీజన్‌లో నిన్నటి వరకు లక్షా 13వేలకు పైగా రైతుల నుంచి రూ. 1,510 కోట్ల విలువైన 7.71లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు.
ఈ సీజన్‌లో నేటి వరకు దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నాం. -గంగుల కమలాకర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
ధాన్యం(paddy procurement in telangana) రవాణాలోనూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్న మంత్రి... ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నట్లు వివరించారు. ఈ నవంబరు కోసం 2లక్షల 99వేల 310 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించగా... ఇప్పటి వరకు 2లక్షల 29వేల 231 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. మొత్తం రేషన్ కార్డుల్లో దాదాపు 67లక్షల లబ్ధిదారులు బియ్యాన్ని తీసుకున్నట్లు మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: 'తేల్తుంబ్డే మరణం.. మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ'