ETV Bharat / state

రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనం: ఎర్రబెల్లి

Minister Errabelli: రేవంత్​ రెడ్డి చంద్రబాబు ఏజెంట్​లా పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఆరోపించారు. రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనమవుతుందని ఆయన విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా పూర్తిగా రేవంత్‌రెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనం: మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Apr 22, 2022, 4:16 PM IST

Updated : Apr 22, 2022, 4:40 PM IST

Minister Errabelli: రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు విమర్శించారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలు ఒక్కరైనా.. రేవంత్‌ మంచోడని చెప్పమనండి.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్‌ చేసిన లాలూచీ పనులు కేసీఆర్‌ చేయలేదన్నారు. రేవంత్ చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఆయన భాష మార్చుకోవాలంటూ సూచించారు.

తెలంగాణను అభివృద్ధి చేయడంతో పాటు మిషన్‌ భగీరథ ద్వారా గ్రామగ్రామానికి తాగునీళ్లందించిన ఘనత కేసీఆర్‌దేనని మంత్రి అన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంటు కోసం ధర్నాలు చేసేవారని.. ఈ ఏడేళ్లలో ఎక్కడైనా నీళ్లు, కరెంటు కోసం ధర్నాలు జరిగాయా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇక్కడి పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ రైతులకు ఎదురు పెట్టుబడి ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు. రైతుల కోసం సభ పెడుతుంటే కాంగ్రెస్‌ వాళ్లే అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. బియ్యం కొంటామని కేంద్రం మోసం చేస్తే కేసీఆర్‌ ముందుకొచ్చి కొంటున్నారన్న ఆయన.. రైతుల కోసం దాదాపు 3 నుంచి 4 వేల కోట్ల నష్టాన్ని కూడా కేసీఆర్‌ లెక్క చేయడం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పూర్తిగా రేవంత్‌రెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఏజెంట్​: రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనమవుతుంది. రేవంత్‌రెడ్డి వంటి లాలూచీ పనులు కేసీఆర్‌ చేయలేదు.రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. తెదేపాలో ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం పనిచేస్తే.. రేవంత్‌ చంద్రబాబు వద్ద కూర్చున్నారు. కేసీఆర్‌.. తెలంగాణను అభివృద్ధి చేసిన మహానేత. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామగ్రామానికి తాగునీళ్లందించిన ఘనత కేసీఆర్‌ది. పీసీసీ అధ్యక్షుడిగా పూర్తిగా రేవంత్‌రెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నారు. -ఎర్రబెల్లి దయాకర్​ రావు, రాష్ట్ర మంత్రి

రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనం: ఎర్రబెల్లి

ఇవీ చదవండి:

Last Updated : Apr 22, 2022, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.