ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు వంగిపురం హరికిషన్ హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు ఆస్ట్రేలియా, మరొకరు గుజరాత్లో ఉన్నారు. డా.కె.వి రమణాచారి, లోహిత్ కుమార్, తదితరులు హరికిషన్ భౌతిక కాయాన్ని ఆస్పత్రి మార్చురిలో ఇవాళ ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చాలా కాలం నుంచి డయాలసిస్ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన చివరి శ్వాస వరకు మిమిక్రి కళలోనే జీవించారు.
ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జన్మించారు. అతను 8 ఏళ్ల వయసులోనే తమ గురువుల, బంధువులు కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించారు. తర్వాత కాలంలో ప్రముఖుల, క్రికెట్ కళాకారుల, సినీ తారల, కవుల, గాయకుల గొంతును అనుసరించడం నేర్చుకున్నారు. పశుపక్ష్యాదుల, యంత్రాలు శబ్దాలు, సంగీత వాద్య పరికరాల శబ్దాలను పలికించడం సైతం నేర్చుకున్నాడు.
ఇదీ చూడండి : వలస కార్మికులకు కాంగ్రెస్ చేయూత: ఉత్తమ్