ETV Bharat / state

Mayor On BJP Corporators GHMC Attack: 'సమాజానికి గూండాయిజం నేర్పిస్తున్నారా..?'

కౌన్సిల్‌ సమావేశాలు జరగడం లేదని భాజపా కార్పొరేటర్లు ఆరోపణలు చేయడం సరికాదని మేయర్ విజయలక్ష్మి(mayor Gadwal vijayalakshmi) వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా గతంలోనే వర్చువల్‌గా సమావేశాలు జరిపామన్నారు. భాజపా కార్పొరేటర్ల తీరును ఖండించారు.

Mayor On BJP Corporators GHMC Attack, mayor vijaya lakshmi
భాజపా కార్పొరేటర్ల దాడిని ఖండించిన మేయర్
author img

By

Published : Nov 24, 2021, 4:19 PM IST

GHMC Mayor On BJP Corporators Attack: గ్రేటర్ భాజపా కార్పొరేటర్లు సమాజానికి గూండాయిజం నేర్పిస్తున్నారా..? అని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రశ్నించారు. జీహెచ్​ఎంసీ సమావేశాలే జరగడం లేదనే భాజపా కార్పొరేటర్ల ఆరోపణలు సరికాదన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ మార్గదర్శకాలకు(covid regulations) అనుగుణంగా గతంలోనే వర్చువల్‌గా సమావేశాలు జరిపామన్నారు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వచ్చిందన్నారు.

భాజపా కార్పొరేటర్ల దాడిని ఖండించిన మేయర్

కనీస అవగాహన లేదు..

భాజపా కార్పొరేటర్లు చాలా మంది కొత్తవాళ్లే ఉన్నారని.. వాళ్లెవరికీ పాలన విధానంపై కనీస అవగాహన లేదని ఆరోపించారు. ఏ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఎవరు వస్తారో కూడా తెలియదన్నారు. నిధులు ఉన్నాయా..? లేదా అనేది ముఖ్యం కాదన్న మేయర్‌.. పనులు అవుతున్నాయా..? లేదా..? అనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. భాజపా కార్పొరేటర్ల ప్రవర్తనపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.

'భాజపా కార్పొరేటర్లకు ఒక్కటే చెబుతున్నాను. యాభై వేల మందికి ప్రతినిధులుగా ఉన్న మీరు... నిరసనలు తెలిపే ఎన్నో విధానాలు ఉన్నాయి. నిన్న ఇచ్చినట్లు నినాదాలు ఇస్తే సరే. కానీ ప్రాపర్టీ ధ్వంసం చేయడం సరికాదు. ఇది మేయర్ ప్రాపర్టీ కాదు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ అభివృద్ధి గురించి, సిటీ అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ... ఇలా ధ్వంసం చేయడం సరికాదు. మీరే ధ్వంసం చేసి.. మీరే విధ్వంసం సృష్టిస్తే... మీరు పబ్లిక్​కు ఏం చెబుతున్నట్లు? గూండాయిజం నేర్పిస్తున్నారా?.. ఏదీ ఉన్నా సరే అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. అందరం కలిసి వాటిని పరిష్కరించుకోవాలి.'

-విజయలక్ష్మి, గ్రేటర్ మేయర్

ఇదీ జరిగింది..

హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ... మేయర్‌ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేయటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం (BJP corporators Protest GHMC headquarters) ఏర్పడింది. కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని, కార్పొరేటర్ల ఫండ్ విడుదల చేయాలని భాజపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 5 నెలల క్రితం వర్చువల్‌ మీటింగ్‌ పెట్టినా... పనులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ మేయర్‌ ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని... లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: KTR On BJP Corporators GHMC Attack: 'గాడ్సే అభిమానులను గాంధీ మార్గంలో నడవమని కోరడం అత్యాశే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.