ముఖ్యమంత్రి కేసీఆర్ వనదేవతల ఆగ్రహానికి గురవ్వకతప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కేసీఆర్ హామీలతో దేవతలను మోసం చేశాడని... 2018లో మేడారం అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలు, 200 ఎకరాలు కేటాయిస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తానే స్వయంగా పీఎంతో మాట్లాడతానన్నారని... కానీ ఇప్పటి వరకు దానిపై సమాధానం చెప్పకుండా దాటవేశారని విమర్శించారు.
యాదాద్రి మీద అంత శ్రద్ధ ఎందుకో... మేడారంపై ఇంత అశ్రద్ధ ఎందుకని ప్రశ్నించారు. పాలనలో వివక్ష, అధికార యంత్రాంగంలో వివక్ష, మా దేవతలపై కూడా వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. మేడారం విషయంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం నిరంతరం కొనసాగుతుందని మందకృష్ణ మాదిగ చెప్పారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన...