హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర భాజపా కార్యాలయాన్ని తెలంగాణ మాదిగ ఐకాస ముట్టడించింది. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన ముట్టడి తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. కార్యాలయలోపలికి చొచ్చుకుపోవడానికి యత్నించడం వల్ల పోలీసులు అడ్డుకున్నారు.
పరిస్థితి విషమించడం వల్ల పోలీసులు ఐకాస నాయకులను బలవంతంగా అరెస్టు చేసి బేగంబజార్ పీఎస్కు తరలించారు. తక్షణమే పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఐకాస నాయకులు డిమాండ్ చేసారు. భాజపా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేస్తుందని.... పార్లమెంటులో వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. భాజపా ఎస్సీ వర్గీకరణ చేయకుండా అడ్డుపడితే... రాష్ట్రంలో భాజపా నాయకులు తిరగకుండ అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'