విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు దేశ పరిస్థితులపై పూర్తి అవగాహన పెంపొందించాలని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ ఐఏఎస్ స్టడీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై పలు ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా ప్రస్తుతం చర్చలో ఉన్న 370 ఆర్టికల్ విషయంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో జమ్ము కశ్మీర్ అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. ఒకే దేశం- ఒకే ఙెండా విధానాన్ని ప్రధాని నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు.
ఇవీచూడండి: కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ప్రధానికి కోమటిరెడ్డి లేఖ