మోదీ నిజాయితీ మరోసారి నిరూపితమైందన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. రఫేల్‌పై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశ అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటే... రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అశాంతి, అసంతృప్తి నెలకొందని విమర్శించారు.
సచివాలయంలో ఉండాల్సిన ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో... స్టేషన్‌లో ఉండాల్సిన పోలీసులు ఆర్టీసీ డిపోలు, రెవెన్యూ కార్యాలయాల వద్ద ఉంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వివిధ సంస్థలకు ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయిలు పడిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రెవెన్యూ ఉద్యోగులు తోడైతే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందనే ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని ఆశ చూపిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.
ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ