ETV Bharat / state

అతని నాట్యం చూస్తే... అమ్మాయిలైనా అసూయ పడాల్సిందే..!

author img

By

Published : Jan 2, 2020, 12:49 PM IST

అందంగా ముస్తాబై వయ్యారం వొలికిస్తూ తన నాట్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రతిభ ఆ యువకుడి సొంతం. స్త్రీ వేషధారణలో అభినయానికి రక్తికట్టిస్తూ హావభావాలు పలికించే ఆ కుర్రాడిని చూసి కళాప్రేమికులు నిండుమనసుతో ఆశీర్వదించక మానరు. లయబద్ధంగా ఆ యువకుడు చేసే ప్రదర్శనలను ప్రేక్షకులు రెప్పవాల్చకుండా తన్మయత్వంతో తిలకిస్తారు. ఎందరో ప్రముఖుల ప్రశంసలు, ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతంచేసుకున్న ఆ యువకుడే కర్నూలుకు చెందిన రఘునాథ్.

MAN DANCE
అతని నాట్యం చూస్తే... అమ్మాయిలైనా అసూయ పడాల్సిందే..!
అతని నాట్యం చూస్తే... అమ్మాయిలైనా అసూయ పడాల్సిందే..!

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రఘునాథ్​కు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి. నాట్యాచార్యుడు డాక్టర్ కేవీ భార్గవ్ కుమార్ దగ్గర కూచిపూడిలో ఓనమాలు నేర్చుకున్నారు. పన్నెండేళ్ల నుంచే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. పదమూడో ఏటే... సిలికాన్ ఆంధ్ర వారి తెలుగు తేజం కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాడు.

ప్రాచీన కళాకేంద్ర నుంచి కూచిపూడిలో రఘునాథ్ డిప్లొమో పూర్తి చేశారు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గురువుకు చేదోడుగా ఉంటూ అతనికి చెందిన...నృత్య జ్యోతి ఫైన్ ఆర్ట్స్ డెవలప్ మెంట్​లో చిన్నారులకు నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. కొంతకాలం పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు నాట్యంలో మెలకువలు నేర్పించాడు. కళాశాల అధ్యాపకులు, స్నేహితులు ప్రోత్సహిస్తే చదువుతో పాటు నాట్యాన్ని కొనసాగిస్తునంటున్నాడు రఘునాథ్.

నృత్య జ్యోతి తరఫున రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి ప్రదర్శనలిస్తున్నారు రఘునాథ్. ఏటా దిల్లీలో నిర్వహించే బాలోత్సవ్​లో నృత్య ప్రదర్శన ఇస్తున్నాడు. నేషనల్ యూత్ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర, పంజాబ్, చండీఘర్, బాబర్​లో తన ప్రతిభ చూపిస్తున్నాడు. నృత్య జ్యోతి సంస్థ నుంచి నృత్య ప్రియ అవార్డును అందుకున్నారు.

స్త్రీ వేషధారణలో కూచిపూడిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు రఘునాథ్. అర్థనారీశ్వరం, మహిషాసురమర్ధిని, భామాకలాపం తదితర నృత్యాంశాల్లో... విశేషంగా రాణిస్తున్నారు. తన ప్రతిభకు ఎన్నో అవార్డులు సొంతమయ్యాయి. రాజకీయనాయకులే కాకుండా ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్నారు. ఏ పాత్రలో నాట్యం చేస్తున్నామో ఆ పాత్రలోకి ప్రవేశించి నృత్యం చేసి ఎవరినైనా మెప్పిస్తాడు. తన దగ్గరున్న విద్యను పదిమందికి పంచాలని.. అప్పుడే తన కళకు సార్థకత చేకూరుతోందని రఘునాథ్ చెబుతున్నారు.

ఇదీ చదవండి: మజిల్​ మానియా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాదీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.