KTR about Urban parks : ప్రకృతి ఒడిలో గడిపేందుకు రాష్ట్రంలోని అర్బన్ పార్కులు అద్భుతమైన ప్రదేశాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అర్బన్ పార్కుల్లో పలు సౌకర్యాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. వాకింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, సైక్లింగ్ లాంటి వాటితో సరదాగా గడపవచ్చునని మంత్రి ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా అర్బన్ పార్కుల సమాచారం తెలుసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు.
-
All credit to Hon’ble CM Sri #KCR Garu’s vision of #HaritaHaaram and statutory provision of special #GreenBudget in all Municipalities & Gram Panchayats 🎄 https://t.co/26YLQfEHbZ
— KTR (@KTRTRS) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">All credit to Hon’ble CM Sri #KCR Garu’s vision of #HaritaHaaram and statutory provision of special #GreenBudget in all Municipalities & Gram Panchayats 🎄 https://t.co/26YLQfEHbZ
— KTR (@KTRTRS) January 21, 2022All credit to Hon’ble CM Sri #KCR Garu’s vision of #HaritaHaaram and statutory provision of special #GreenBudget in all Municipalities & Gram Panchayats 🎄 https://t.co/26YLQfEHbZ
— KTR (@KTRTRS) January 21, 2022
హరితహారానికి ప్రాధాన్యం
రాష్ట్రంలో పచ్చదనం పెంపు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. హరితహారంతో పాటు పట్టణాలు, గ్రామాల్లో గ్రీన్ బడ్జెట్ను చట్టంలోనే పొందుపరచడం సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హరిత తెలంగాణే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఏడు విడతలుగా మొక్కలను నాటింది. కేవలం నాటడానికే పరిమితం కాకుండా... వాటిని సంరంక్షించే బాధ్యతనూ అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో అటవీ శాతం పెరుగుతోంది.
రెండో స్థానంలో తెలంగాణ
Forest Area In Telangana: దేశంలో గత రెండేళ్లుగా అటవీవిస్తీర్ణం, సంబంధించిన అంశాలపై కేంద్ర అటవీశాఖ ఇటీవల రూపొందించిన నివేదికలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా 647 చదరపు కిలోమీటర్లు పెరగగా... 632 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 2019 నివేదిక ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 20,582 చదరపు కిలోమీటర్లు కాగా 2021 నివేదిక ప్రకారం ఆ మొత్తం 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
అగ్రభాగాన హైదరాబాద్
దేశంలోని మెగాసిటీల్లో చూస్తే గడచిన పదేళ్లుగా అటవీవిస్తీర్ణం పెరుగుదలలో హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. దిల్లీ, ముంబయి, కోల్కతా, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో 509 చదరపు కిలోమీటర్ల మేర అటవీప్రాంతం విస్తరించి ఉంది. వాటి మొత్తం భూభాగంలో ఇది 10.21 శాతం.
హరితహారం సత్ఫలితాలు
వృద్ధిలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. నగరంలో గత పదేళ్లుగా 48.66 చదరపు కిలోమీటర్ల మేర ఆటవీవిస్తీర్ణం పెరిగినట్లు కేంద్ర నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం సత్ఫలితాలను ఇస్తోందని చెప్పవచ్చు. ఆ కారణంగానే రాష్ట్రంలో ఆటవీవిస్తీర్ణం పెరిగింది. హైదరాబాద్, శివారులో అర్బన్ పార్కుల అభివృద్ధి, ఆటవీప్రాంతాల పరిరక్షణ, పచ్చదనం పెంపు చర్యలు ఫలితాలు ఇస్తున్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని కవ్వాల్ పులుల సంరక్షణా ప్రాంతంలో అడవుల విస్తీర్ణం 118.97 చదరపు కిలోమీటర్ల మేర తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.
ఇదీ చదవండి: ప్రకృతి అందాలతో మదిని దోచేస్తున్న ఖమ్మం అర్బన్ పార్కు