ETV Bharat / state

ప్రతీ రైతు గడపకు పథకాలు చేరాలి: కేటీఆర్

author img

By

Published : Mar 2, 2020, 1:30 PM IST

ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా రైతు సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తమదేనని కేటీఆర్​ స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఆయన అభివర్ణించారు. సహకార సంఘాల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్నికైన వారిలో 48 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు కేటీఆర్ తెలిపారు.

రైతుల కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడని ప్రభుత్వం మాది: కేటీఆర్​

తెరాస ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు అయిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందుకే రాష్ట్రంలో రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. సహకార సంఘాల ఎన్నికల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లుగా గెలిచిన వారితో తెలంగాణ భవన్​లో కేటీఆర్ సమావేశమయ్యారు.

ఖర్చుకు వెనకాడం...

రైతులకు రైతు బీమా, రైతు బంధులాంటి ప్రత్యేక పథకాలను దేశంలోని తొలిసారిగా ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్​దే అని కేటీఆర్​ పేర్కొన్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా రైతు సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తమదేనని కేటీఆర్ తెలిపారు. రైతులు తమ మీద అపారమైన ప్రేమతో 906 సంఘాల్లో 94 శాతానికి పైగా కట్టపెట్టి అపూర్వమైన విజయాన్ని అందించారని కేటీఆర్ అన్నారు. రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభిచాలని అధికారులకు ముఖ్యమంత్రి అదేశాలు జారీ చేశారని కేటీఆర్ తెలిపారు.

అభివృద్ధిని రైతుల్లోకి తీసుకుపోవాలి..

సహకార సంఘాల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్నికైన వారిలో 48 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని సహకార సంఘాల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు కేటీఆర్​ సూచించారు.

ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.