ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఔత్సాహిక ఆవిష్కరణల ప్రదర్శన ఈసారి నిరాడంబరంగా జరిగింది. టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్- 2020 ప్రదర్శనను మంత్రి కేటీఆర్.. వర్చువల్గా ఆవిష్కరించారు.
కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రదర్శనలను ఆన్లైన్కు పరిమితం చేశారు. ఈ ప్రదర్శనకు 33 జిల్లాల నుంచి 250 దరఖాస్తులు వచ్చాయి. 65 ఆవిష్కరణలు మాత్రమే జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనకు ఎంపికయ్యాయి. రాష్ట్రం నలుమూలల్లోని నైపుణ్యం ఉన్న ఔత్సాహికులు, ఆవిష్కరణలను వెలికితీయటమే ఈ 'ఇంటింటా ఇన్నోవేటర్' లక్ష్యమని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తెలిపింది.
ఇవీచూడండి: బామ్మ అభ్యర్థనకు ముగ్ధుడైన మంత్రి...