ETV Bharat / state

KTR launch fighter wings: 'రక్షణ ఉత్పత్తులకు తెలంగాణ ఎంతో అనుకూలం' - టాటా ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ ఫైటర్ వింగ్స్

KTR launch fighter wings: గత ఐదేళ్లలో తెలంగాణ పారిశ్రామికంగా మంచి అభివృద్ధి సాధిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. టీఎస్ ఐపాస్​తో అభివృద్ధి వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు. ఏరో స్పేస్​సెక్టార్​లో 2020లో తెలంగాణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అవార్డు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆదిభట్లలో టాటా ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు.

ktr
ktr
author img

By

Published : Dec 7, 2021, 2:08 PM IST

Updated : Dec 7, 2021, 6:36 PM IST

KTR launch fighter wings: దేశ రక్షణ రంగానికి కావల్సిన పరికరాల తయారీ, ఉత్పత్తికి... తెలంగాణ ఎంతో అనుకూలంగా మారుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గడిచిన ఐదేళ్లలో ఈ రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఆదిభట్లలోని టాటా లాక్​హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఎఫ్-16 యుద్ధ విమానం కోసం తయారు చేసిన ఫైటర్ వింగ్స్​ను లాంఛనంగా ఆవిష్కరించారు. మేడిన్ హైదరాబాద్​గా ఫైటర్ వింగ్స్ తయారు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవలే ఈ రెండు సంస్థలు కలిసి 150వ సీ130జే ఎంపెన్నేజ్ తయారీ చేసి మైలురాయి చేరుకున్నాయని కేటీఆర్ అన్నారు. టాటా, లాక్​హీడ్ మార్టిన్​ల బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

టాటా, లాక్​హీడ్ మార్టిన్ భాగస్వామ్యం శుభ పరిణామమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2018లో ఎఫ్-16 యుద్ధవిమానాల కోసం ఫైటర్ వింగ్స్ ప్రొటోటైప్ తయారు చేశారని.... ఇప్పుడు పూర్తిస్థాయి ఉత్పత్తిలోకి ప్రవేశించామని వెల్లడించారు. ఫైటర్ వింగ్స్ తయారీలో 16 సప్లయర్స్ ఉన్నారని కేటీఆర్ తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణ పారిశ్రామికంగా మంచి అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. ఏరో స్పేస్ సెక్టార్​లో 2020లో తెలంగాణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అవార్డు ఇచ్చిందని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీఎస్ఐపాస్ వల్ల పారిశ్రామికంగా తక్షణ అనుమతులు లభించడంతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ లాంటి దేశాలు తెలంగాణలో రక్షణ రంగానికి కావల్సిన పరికరాల తయారీలో మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇందుకు లాక్​హీడ్ మార్టిన్ ఏరో స్ట్రక్చర్స్ లిమిడెట్ ఉదాహరణగా నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

'ఐదేళ్లలో తెలంగాణ పారిశ్రామికంగా మంచి అభివృద్ధి సాధిస్తోంది'

ఇదీ చూడండి: Harish Rao at NIMS: నిమ్స్‌లో అందుబాటులోకి మరిన్ని ఆధునిక వైద్య సేవలు

Last Updated : Dec 7, 2021, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.