మేడ్చల్ జిల్లా కీసర మండల ఎంపీడీఓ వివాదంలో ఇరుక్కున్నారు. సామాజిక మాధ్యమంలో అశ్లీల వీడియో పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఆ వీడియోను అధికారిక గ్రూప్లో ఎంపీడీఓ పోస్ట్ చేశారు. ఒకవైపు కీరస మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ.. ఉన్నాయి. మరోవైపు హరితహారం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. కరోనా కట్టడిపై పనిచేయాల్సిన కీసర మండలం ఎంపీడీఓ మండలానికి సంబంధించిన అధికారులతో ఉన్నటు వంటి వాట్సాప్ గ్రూప్లో ఓ అశ్లీల వీడియోను పోస్ట్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రూపు సభ్యులు.