పెరుగుతున్న రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలు రైతాంగానికి మోయలేని భారంగా మారాయని, తక్షణమే వాటిని నియంత్రణలోకి తీసుకురావాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి లేఖ రాశారు. యంత్రీకరణ వ్యవసాయ రంగంలో సర్వసాధారణమైందని... దుక్కి దున్నే దగ్గర నుంచి పంటల నూర్పిడి వరకు, పురుగుమందుల పిచికారీ, ముడి సరకుల రవాణా తదితర వాటికి వాహనాలు, యంత్రాలు వాడాల్సి వస్తుందని వివరించారు.
ప్రతి పనికి పెట్రోల్, డీజిల్ ముడి పడి ఉంటాయని, వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్లు, యంత్రాలకు అవసరమైన పెట్రోల్, డీజిల్‌లను రాయితీపై ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధరను పెంచాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: నిరాశాజనకం: మన ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు నామమాత్రమే!