Naveen Murder Case Remand Report: నవీన్ హత్య కేసు రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడనే కారణంతో హరిహరకృష్ణ నవీన్‌ను దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఇందుకోసం 3 నెలల ముందే నుంచే నిందితుడు హరిహరకృష్ణ నవీన్ హత్యకు కుట్రపన్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నిందితుడు రెండు నెలల క్రితం సూపర్ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేశాడని తెలిపారు.
ఈ నెల 17న మద్యం మత్తులో యువతి విషయంలో నవీన్ హరిహరకృష్ణ మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో హరిహరకృష్ణ నవీన్‌ను ఓఆర్ఆర్ సమీపంలో గొంతునులిమి హత్య చేశాడని చెప్పారు. అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి తల, వేళ్లు, ఇతర భాగాలు బ్యాగులో వేసుకొని వెళ్లాడని వివరించారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లికి చేరుకొని నవీన్ అవయవాలు పారేశాడని వివరించారు.
నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌కు తెలియజేశాడని పోలీసులు అన్నారు. మరుసటిరోజు ప్రియురాలికి హత్య విషయాన్ని నిందితుడు చెప్పాడని పేర్కొన్నారు. హత్య తర్వాత నిందితుడు వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖలో నిందితుడి తిరిగాడని గుర్తించారు. ఈనెల 24న మరోసారి హత్య చేసిన స్థలానికి వెళ్లినట్లు హరిహరకృష్ణ అంగీకరించాడు. అప్పుడు మిగిలిన శరీర భాగాలు సేకరించి దహనం చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అదేరోజు సాయంత్రం పోలీసుల ఎదుట హరిహరకృష్ణ లొంగిపోయాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.
నవీన్‌ను హత్య చేసేందుకు హరిహరకృష్ణ పలు క్రైం వెబ్ సిరీస్‌లతో పాటు, యూట్యూబ్ చూసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన కొడుకు చేసింది తప్పేనని హరికృష్ణ తండ్రి ప్రభాకర్ పేర్కొన్నారు. అయితే తన కొడుకు ఒక్కడే అంత కిరాతకంగా హత్య చేయడం సాధ్యం కాదని, ఇంకా ఈ హత్య వెనుక ఎవరో ఉన్నారని విమర్శించారు. హత్య కేసుపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబ సభ్యులను క్షమించమని ప్రభాకర్ వేడుకున్నారు. కృష్ణ, నవీన్ ఇద్దరు ఇంటర్ నుంచి మంచి స్నేహితులేనని, ఒక అమ్మాయి మూలంగా ఇద్దరు జీవితాలు పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిల ట్రాప్‌లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన యువకులకు సూచించారు.
మరోవైపు చేతికొచ్చిన కొడుకు చనిపోవడాన్ని నవీన్ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: ట్ర'యాంగ్రి'ల్ స్టోరీ.. ఎవరు ఎవర్ని లవ్ చేశారు? ఎవరు బలయ్యారు?
నా కొడుకు చేసింది తప్పే కానీ నవీన్ హత్య ఒక్కడి వల్ల సాధ్యం కాదు
అయ్యా కలెక్టర్ సార్.. మా ఊర్లో కింగ్‌ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఫిర్యాదు
'ఆ కట్టడాలు, రోడ్ల పేర్లు మార్చేందుకు ప్రత్యేక కమిషన్'.. సుప్రీం కీలక నిర్ణయం