ETV Bharat / state

బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా.. ఆయన వల్లేనట

author img

By

Published : Feb 16, 2023, 12:25 PM IST

Updated : Feb 16, 2023, 12:45 PM IST

Kanna Lakshmi Narayana Resigned to BJP : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు ​కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి ఇవాళ రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీలో వచ్చిన పరిణామాలతో పార్టీలో ఇమడలేకనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Kanna Lakshmi Narayana
Kanna Lakshmi Narayana

Kanna Lakshmi Narayana Resigned to BJP: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన విషయాన్ని బయటపెట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షునిగా పనిచేసిన అతను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ఏపీలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలుపై ఈరోజు స్పష్టత వచ్చింది. గుంటూరులోని ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం సరిగా లేదని అన్నారు. దీనివలనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అతనితో పాటు ఏపీలో ప్రముఖ ముఖ్య రాజకీయ నేతలు రాజీనామాలను ఈ సమావేశంలో ప్రకటించారు.

ఆయన రాజీనామా అనంతరం ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టత రాలేదు. దీంతో మళ్లీ ఈ విషయంపై ఆసక్త నెలకొంది. గతంలో కన్నా పార్టీలు మారుతున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. ఒకసారేమో టీడీపీలోకి వెళ్తారనుకొని నియోజకవర్గం అంతా చర్చించుకొన్నారు. ఇంకోసారి జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు పుకారులు చక్కరులు కొట్టాయి. ప్రస్తుతానికి ఈ మీడియా సమావేశంలో ఏమి ఆయన ప్రకటించలేదు.

'2014లో మోదీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలో చేరా. బీజేపీలో ఏ స్థానంలో ఉన్నా కార్యకర్త మాదిరిగా పనిచేశా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు నాకు అధ్యక్ష పదవి ఇచ్చారు. రాష్ట్రంలో అన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులను నిలబెట్టా. 2019 తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషిచేశా. 2024లో బీజేపీను అధికారంలోకి తేవడం కోసం పనిచేశా. అమరావతికి వ్యతిరేకంగా జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. జగన్‌ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడా. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా రాజధానిపై తీర్మానం చేశాం. సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక పరిస్థితి మారింది. మోదీ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. ప్రస్తుత పరిణామాలతో బీజేపీలో ఇమడలేకపోయా.' - కన్నా లక్ష్మీనారాయణ

2019 తర్వాత అనేకమంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలో చేరారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజల తరఫున అనేక సమస్యలపై పోరాటం చేశారని వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తనతో పాటు రాజీనామా చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్‌ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని కన్నా పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 16, 2023, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.