గురువారం ఉదయం 11గంటలకు ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి నెలాఖరుకు కోటాను అందుబాటులో ఉంచనుంది. టికెట్లను నమోదు చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో కల్యాణోత్సవం జరగనుంది. తపాలా శాఖ ద్వారా భక్తులకు కల్యాణోత్సవం అక్షింతలు, వస్త్రాలను తితిదే పంపనుంది. ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా కల్యాణోత్సవం సేవ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఇవీ చూడండి: తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు