ETV Bharat / state

Kalti Medicines manufacture in Hyderabad : 'డ్రగ్స్‌ ఇండియా మహవీర్‌' పేరుతో.. కల్తీ మందుల తయారీ

Adulteration Medicines Gang Arrested in Hyderabad : కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు.. పరిస్థితిని బట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలే కాదు.. నగరం నడిబొడ్డున కూడా కల్తీ దందా నిర్వహిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నెలల తరబడి మగ్గిన ముడి పదార్ధాలు, అపరిశుభ్ర వాతావరణం, ఫ్లేవర్ల కోసం రంగులు వాడుతూ.. అక్రమార్జన కోసం నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఔషధాలు కూడా కల్తీవి తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముఠా నుంచి భారీగా ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Kalti Medicines Gang Arrest In Hyderabad

author img

By

Published : Jun 16, 2023, 11:34 AM IST

'డ్రగ్స్‌ ఇండియా మహవీర్‌' పేరుతో కాలం చెల్లిన మందుల ముడిసరుకు పంపిణీ

Kalti Medicines Production in Hyderabad : కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. చిన్నపిల్లలు తింటారన్న ఆలోచన లేదు.. ప్రాణాలు పోతాయన్న సోయిలేదు. ఎవరేమైపోతే మాకేంటి.. గల్లా పెట్టెలో డబ్బులు పడితే చాలనే ధోరణి కనిపిస్తుంది ఎక్కడ చూసినా. ఇటీవల పిల్లలు తినే ఐస్‌ క్రీమ్‌లు, చాక్లెట్లు, కేకులు కల్తీ చేసిన ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ ఆ కల్తీ పదార్థాలు తిని ఆనారోగ్యం పాలైతే కోలుకునేందుకు వేసుకునే మాత్రలు కూడా కల్తీవే అని ఎప్పుడైనా అనుకున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త లేబుల్‌ చూడకుండా మాత్రలు వేసుకుంటే ప్రాణాలు గాల్లో కలసిపోయినట్లే. తాజాగా మందులు సైతం కల్తీవి తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. వారి నుంచి భారీగా ముడిపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Kalti Medicines manufacture in Hyderabad : హైదరాబాద్​లో కల్తీరాయుళ్ల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గుజరాత్‌కు చెందిన ఉమేశ్‌ బాబూలాల్‌ సేత్‌.. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాడు. 'డ్రగ్స్‌ ఇండియా మహవీర్‌' పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. కొత్తపేటలో ఔషధాల తయారీకి ఉపయోగించే ముడి సరుకును సరఫరా చేస్తున్నాడు. ఎక్కువ సంపాదనకు ఆశపడ్డ బాబూలాల్‌ కాలం చెల్లిన ముడిసరుకును కొనుగోలు చేసి తక్కువ ధరకు ఔషధ తయారీ సంస్థలకు సరఫరా చేయాలని పథకం పన్నాడు.

Medicines Adulteration in Hyderabad : గుజరాత్, మహారాష్ట్రలోని ఫార్మా పరిశ్రమల నుంచి కాలం చెల్లిన ముడిసరుకు తక్కువ ధరకు కొనుగోలు చేసి అడ్డదారుల్లో హైదరాబాద్‌కు చేరుస్తున్నాడు. ఆ సరుకును నగరంలోని చిన్న తరహా ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారంతో ఎస్​ఓటీ, ఎల్బీనగర్‌ పోలీసులు.. వైద్య శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. అతని వద్ద రూ.కోటి విలువైన 10 వేల 636 కిలోల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో మరికొంత మంది పరారీలో ఉన్నట్లు సమాచారం.

Adulteration Medicines Gang Arrested in Hyderabad : పట్టుబడిన ముడిసరుకులో జ్వరం, తలనొప్పి, జలుబు సహా వివిధ జబ్బులు నయం చేసేందుకు వాడే సరుకు అధికంగా ఉంది. ముడిసరుకులో 3 వేల 236 కిలోల ముడిసరుకు కాలపరిమితి 2019లోనే ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. గత ఐదేళ్లుగా ఈ చీకటి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతను సరఫరా చేసే ముడిసరుకుతో నొప్పి నివారణ, జ్వరం, చర్మవ్యాధులు, రోగ నిరోధక శక్తి పెంపు, చర్మ క్యాన్సర్‌ తదితర జబ్బుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలు తయారుచేస్తున్నట్లు తెలిసింది. నిందితుడు హైదరాబాద్‌లోని ఏయే ఔషధ సంస్థలకు విక్రయించాడనే అంశాలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.